Tuesday, 8 September 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీడీపీ యువ నాయకుడి చేయూత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీడీపీ యువ నాయకుడి చేయూత

సంగంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీడీపీ యువ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ దాతృత్వంతో ఐడీ కార్డులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కోరిన వెంటనే స్పందించిన ఆయన, పాఠశాలలోని విద్యార్థులందరికీ కాకు వెంకట కొండయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులను సమకూర్చారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య పాల్గొని విద్యార్థులకు ఐడీ కార్డులను అందజేశారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలకు సహకారం అందించిన కాకు మధుసూదన్ యాదవ్‌ను ఎంఈఓ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచిన ఆయన సేవలను ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.