Saturday, 12 September 2026
  • Home  
  • ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కీలకం
- పెద్దపల్లి

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కీలకం

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీరాములు పెద్దపల్లి, సెప్టెంబర్ 10: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు అన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లిలోని శ్రీనివాస గార్డెన్స్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రుల కోసం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్ అవకాశాల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పిల్లలను పరిమితులతో చూడకుండా, వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రేమ, ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహంతో పిల్లలను ముందుకు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా అంజారెడ్డి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగిన తన ప్రయాణాన్ని వివరించారు. ఆయన మాటలు తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చాయి. రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా ఉన్నత విజయాలు సాధించగలరన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హరిబాబు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ, ప్రోత్సాహం అవసరమని తెలిపారు. అపోలో ఆసుపత్రుల బాల వైద్య నిపుణులు డా. ఏ. జగదీష్ పిల్లల శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స, శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐఈ సమన్వయకర్త జి. కవిత, ప్రణాళిక సమన్వయకర్త చేపూరి మల్లేష్ గౌడ్, మండల విద్యాధికారులు, అధికారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకు సమాన అవకాశాలు కల్పించి విద్య, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీరాములు

పెద్దపల్లి, సెప్టెంబర్ 10:
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు అన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లిలోని శ్రీనివాస గార్డెన్స్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రుల కోసం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్ అవకాశాల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పిల్లలను పరిమితులతో చూడకుండా, వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రేమ, ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహంతో పిల్లలను ముందుకు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా అంజారెడ్డి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగిన తన ప్రయాణాన్ని వివరించారు. ఆయన మాటలు తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చాయి. రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా ఉన్నత విజయాలు సాధించగలరన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హరిబాబు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ, ప్రోత్సాహం అవసరమని తెలిపారు. అపోలో ఆసుపత్రుల బాల వైద్య నిపుణులు డా. ఏ. జగదీష్ పిల్లల శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స, శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐఈ సమన్వయకర్త జి. కవిత, ప్రణాళిక సమన్వయకర్త చేపూరి మల్లేష్ గౌడ్, మండల విద్యాధికారులు, అధికారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకు సమాన అవకాశాలు కల్పించి విద్య, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.