రైల్వేకోడూరు నియోజకవర్గం రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు.
తాగునీటి సరఫరా, గ్రామీణ రహదారులు, పెన్షన్లు, రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలు, విద్యుత్, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు వివరించారు. వినతులను పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను కోరారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
రైల్వేకోడూరు నియోజకవర్గం రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. తాగునీటి సరఫరా, గ్రామీణ రహదారులు, పెన్షన్లు, రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలు, విద్యుత్, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు వివరించారు. వినతులను పరిశీలించిన ముక్కా రూపానంద రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

