Wednesday, 23 September 2026
  • Home  
  • ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం
- నిర్మల్

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం

శశి హార్ట్ కేర్ సెంటర్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్, సెప్టెంబర్ 21: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, హృదయ సంబంధిత చికిత్సలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిర్జా షోయేబ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన హృదయ వైద్య సేవలు అందించే ఆసుపత్రి ఉండటం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్

శశి హార్ట్ కేర్ సెంటర్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్
నిర్మల్, సెప్టెంబర్ 21: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, హృదయ సంబంధిత చికిత్సలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిర్జా షోయేబ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన హృదయ వైద్య సేవలు అందించే ఆసుపత్రి ఉండటం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.