ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : శ్రీ వరహాలక్ష్మి శ్రీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎం. సీతారాం పాత్రుడు (నవీన్ )
విజయనగరం, జిల్లా బ్యూరో /రమణ, సెప్టెంబర్ 13. ( పున్నమి ప్రతినిధి )
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని
సింహాచలం దేవస్థానం శ్రీ వరాహ లక్ష్మి శ్రీ నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యుడు మాకేన సీతారాం పాత్రుడు నవీన్ శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. గణపయ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని కోరారు.
ప్రతిష్ట సమయాలలో, విద్యుత్ అలంకరణ సమయంలో నిమజ్జన సమయాలలో చెరువులు, కాలవలు, ప్రాజెక్టులు వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాలలో పోలీసు అధికారులు తెలియజేసిన భద్రతా నియమాలను పాటించాలన్నారు. భక్తి పూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో శుభప్రదంగా జరగాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పర్యావరణ హితమైన వస్తువులతో పండుగను నిర్వహించాలని సూచించారు. వినాయక చవితిని ఆధ్యాత్మిక భావనలతో జరుపుకోవాలని మాకేన సీతారాం పాత్రుడు (నవీన్) పిలుపునిచ్చారు.


