Monday, 21 September 2026
  • Home  
  • పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలి: అదనపు ఎస్పీ సౌజన్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలి: అదనపు ఎస్పీ సౌజన్య

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా, క్రమపద్ధతిలో నిర్వహించాలని అదనపు ఎస్పీ సిహెచ్. సౌజన్య పోలీసు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం లాకప్ గదిని పరిశీలించగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనధికారికంగా పేపర్లు, ఇతర వస్తువులను స్టేషన్‌లో ఉంచడం సరికాదన్నారు. మరోసారి ఇదే పరిస్థితి కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సీఐ వెంకట్రావు, ఎస్సై మహమ్మద్ హనీఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా, క్రమపద్ధతిలో నిర్వహించాలని అదనపు ఎస్పీ సిహెచ్. సౌజన్య పోలీసు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం లాకప్ గదిని పరిశీలించగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనధికారికంగా పేపర్లు, ఇతర వస్తువులను స్టేషన్‌లో ఉంచడం సరికాదన్నారు. మరోసారి ఇదే పరిస్థితి కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సీఐ వెంకట్రావు, ఎస్సై మహమ్మద్ హనీఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.