నంద్యాల: సంజామల పోలీస్స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు బోయ బాలకృష్ణకు న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.2023 మార్చి 12న నమోదైన ఈ కేసులో అప్పటి ఎస్ఐ ఎం.ప్రతాప్ పకడ్బందీగా ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి కాగా, నిందితుడిపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. కేసులో పక్కాగా ఆధారాలు సమర్పించి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు, రూ.50 వేల జరిమానా