Tuesday, 4 August 2026
  • Home  
  • పొలం పిలుస్తోంది! కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో వేరుశనగ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
- కడప

పొలం పిలుస్తోంది! కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో వేరుశనగ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

మంగళవారం నాడు వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని స్థానిక మండల వ్యవసాయ అధికారి జి. ఓబులేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేల్పుల గ్రామ పరిధిలో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పులివెందుల వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వేరుశనగ పంటలో సస్యరక్షణ పద్ధతులను, నీటి యాజమాన్య పద్ధతులను మరియు చీడపీడల నివారణకు తగిన సూచనలు సలహాలను రైతులకు క్లుప్తంగా వివరించారు అదేవిధంగా ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలిక వ్యవధి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా ఎరువులను శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదు మేరకే ఉపయోగించాలని అధిక ఎరువుల వాడకం ద్వారా భూసారం నిస్సారం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి జి. ఓబులేసు రైతు సేవా కేంద్రాల సిబ్బంది లక్ష్మీప్రసన్న, కిషోర్ నాయక్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం నాడు వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని స్థానిక మండల వ్యవసాయ అధికారి జి. ఓబులేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేల్పుల గ్రామ పరిధిలో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పులివెందుల వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వేరుశనగ పంటలో సస్యరక్షణ పద్ధతులను, నీటి యాజమాన్య పద్ధతులను మరియు చీడపీడల నివారణకు తగిన సూచనలు సలహాలను రైతులకు క్లుప్తంగా వివరించారు అదేవిధంగా ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలిక వ్యవధి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా ఎరువులను శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదు మేరకే ఉపయోగించాలని అధిక ఎరువుల వాడకం ద్వారా భూసారం నిస్సారం అవుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి జి. ఓబులేసు రైతు సేవా కేంద్రాల సిబ్బంది లక్ష్మీప్రసన్న, కిషోర్ నాయక్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.