Saturday, 25 April 2026
  • Home  
  • పొలం పనుల్లో విషాదం-విషపురుగు కాటుకు రైతు బలి
- తిరుపతి

పొలం పనుల్లో విషాదం-విషపురుగు కాటుకు రైతు బలి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 25 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి మండలంలో శనివారం నాడు ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన ఓ రైతును విషపురుగు కాటువేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం.. గుంట కింద పల్లి గ్రామానికి చెందిన కె. రామిరెడ్డి (45) అనే రైతు, ఊరందూరు ఎస్టీ కాలనీ సమీపంలోని తన పొలంలో పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను ఓ విషపురుగు కుట్టింది. విషం శరీరం అంతా వేగంగా వ్యాపించడంతో రామిరెడ్డి పొలంలోనే కుప్పకూలి మరణించారు. కష్టపడి పనిచేసే రైతు ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న సంబంధిత ప్రభుత్వాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సాగు పనుల్లో నిమగ్నమైన రైతు ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.