Monday, 1 June 2026
  • Home  
  • పెన్షన్ పంపిణీతో అవ్వాతాతల ముఖాల్లో ఆనందం- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

పెన్షన్ పంపిణీతో అవ్వాతాతల ముఖాల్లో ఆనందం- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జూన్ 01, (పున్నమి న్యూస్) : రాష్ట్రంలో ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా అవ్వాతాతలతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా నిర్ణీత తేదీన ఇంటి వద్దకే పెన్షన్ అందుతుండటంతో తమకు ఎంతో సౌలభ్యం కలుగుతోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజా సేవలో భాగంగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.