Thursday, 1 October 2026
  • Home  
  • పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్
- వరంగల్

పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్

నల్లబెల్లి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేసిన నాయకుడని జాటోత్ హుసేన్ నాయక్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో ఒకరి కుటుంబానికి మరొకరు అండగా నిలవడం మన బాధ్యత అని పేర్కొంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి తన సంపూర్ణ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డిగా,మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ,నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నల్లబెల్లి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ పరామర్శించారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేసిన నాయకుడని జాటోత్ హుసేన్ నాయక్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో ఒకరి కుటుంబానికి మరొకరు అండగా నిలవడం మన బాధ్యత అని పేర్కొంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి తన సంపూర్ణ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డిగా,మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ,నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.