గడివేముల మండల ప్రజలు చరవాణిలలో పెట్టుబడి పెట్టండి,అధిక లాభాలు వస్తాయని గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులపై నొక్కి సైబర్ నేరస్థుల వలలో పడవద్దని గడివేముల ఎస్ఐ సిసి.నాగార్జున రెడ్డి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరవాణిలలో ఇటీవల అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ సోషల్ మీడియా, వాట్సాప్,టెలిగ్రామ్,ఫోన్ కాల్స్,నకిలీ వెబ్సైట్లు మరియు మొబైల్ యాప్‌ల ద్వారా పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని,,కానీ కొంతమంది వ్యక్తులు అత్యాశకు గురై సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతున్నారని,తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలను నమ్మవద్దని,తెలియని వ్యక్తులు లేదా సంస్థలు పంపిన లింక్‌లను క్లిక్ చేయవద్దుని,ధృవీకరణ లేని యాప్‌లు లేదా వెబ్సైట్లలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దని,మీ బ్యాంక్ ఖాతా వివరాలు,ఓటీపీ,యూపీఐ,పిన్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని,పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ చట్టబద్ధమైనదో కాదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని, “అధిక లాభాల ఆశతో తొందరపడి తీసుకునే నిర్ణయం,జీవితకాల పొదుపును కోల్పోయే ప్రమాదానికి దారితీస్తుందని”, మీ ఆర్ధిక భద్రత కోసం జాగ్రత్తలు పాటించి సైబర్ నేరాలకు గురి కావద్దని,మండలంలోని ప్రజలు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయడం లేదా డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.సైబర్ క్రైమ్.గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్ లో ఫిర్యాదు నమోదు చేయవచ్చునని లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను గాని,నంద్యాల జిల్లా పోలీస్ కేంద్రంలోని సైబర్ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చునని గడివేముల మండల ప్రజలకు గడివేముల ఎస్ఐ సిసి.నాగార్జున రెడ్డి విజ్ఞప్తి చేశారు

పెట్టుబడి (ఇన్వెస్ట్మెంట్) మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి… గడివేముల ఎస్ఐ సిసి. నాగార్జున రెడ్డి.