Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెంచలకోనలో ఘనంగా చిలుక ద్వాదశి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెంచలకోనలో ఘనంగా చిలుక ద్వాదశి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • బంగారు గరుడ వాహనంపై స్వామివారి దర్శనం..
  • దేవస్థానానికి రూ.4.54 లక్షల ఆదాయం రాపూరు, నవంబర్ : రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం చిలుక ద్వాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి.

బంగారు గరుడ వాహనంపై స్వామివారి దర్శనం.. దేవస్థానానికి రూ.4.54 లక్షల ఆదాయం

రాపూరు, నవంబర్ : రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం చిలుక ద్వాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం నిర్వహించగా, ఉదయం ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంలో కలశాభిషేకం, సాలగ్రామ ధాత్రి పూజలు, హోమ కార్యక్రమాలు చేపట్టారు.అనంతరం నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్ల సమేతంగా శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామివారికి బంగారు గరుడ సేవ నిర్వహించారు. భక్తులు సమర్పించిన 100 గొడుగులతో క్షేత్రోత్సవం జరిపారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.వివిధ పూజా సేవలు, దర్శనాలు, ప్రసాదాల విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.4,54,825 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని పెంచలకోన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా అమ్మవారి ఆలయ మార్గంలోని పొంగళి షెడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్ పొయ్యిలను భక్తుల ప్రసాదాల తయారీకి అందుబాటులోకి తీసుకొచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *