Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. నలుగురికి గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. నలుగురికి గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: మనుబోలు మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • చంద్రారెడ్డి పొలాల సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది.తిరుపతి నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మనుబోలు బైపాస్ సమీపానికి చేరుకోగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
  • టైరు పేలడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు.

నెల్లూరు: మనుబోలు మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రారెడ్డి పొలాల సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది.తిరుపతి నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మనుబోలు బైపాస్ సమీపానికి చేరుకోగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. టైరు పేలడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *