వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు (మార్కెట్ సెంటర్): జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవన సదుపాయం కల్పించడంతో పాటు, అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.శనివారం స్టోన్‌హౌస్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
- గ్రంథాలయ భవనం స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనుల వివరాలను గ్రంథాలయ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి, కార్యదర్శి కుమార్ రాజా మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాత భవనం పటిష్టతపై ఆర్అండ్బీ అధికారులతో సాంకేతిక పరిశీలన చేయిస్తామని తెలిపారు.
- అధికారుల నివేదికలో భవనం వినియోగానికి అనువుగా లేదని తేలితే దానిని తొలగించి, అసంపూర్తిగా ఉన్న నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన రూప్‌కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, కార్పొరేటర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు (మార్కెట్ సెంటర్): జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవన సదుపాయం కల్పించడంతో పాటు, అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.శనివారం స్టోన్‌హౌస్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గ్రంథాలయ భవనం స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనుల వివరాలను గ్రంథాలయ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి, కార్యదర్శి కుమార్ రాజా మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాత భవనం పటిష్టతపై ఆర్అండ్బీ అధికారులతో సాంకేతిక పరిశీలన చేయిస్తామని తెలిపారు. అధికారుల నివేదికలో భవనం వినియోగానికి అనువుగా లేదని తేలితే దానిని తొలగించి, అసంపూర్తిగా ఉన్న నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన రూప్‌కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, కార్పొరేటర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.