నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో సోమవారం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మండలంలోని లెక్కలవారిపాలెం, వింజమూరు పాతూరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు నాలుగు గేదెలు మృతి చెందాయి. దీంతో బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయారు. పశువులపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలకు ఈ ఘటన ఆర్థికంగా పెద్ద దెబ్బగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గేదెలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. పిడుగుపాటు ప్రాంతాల్లో అధికారులు పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం అందించాలని కోరారు.

పిడుగులతో కూడిన భారీ వర్షం.. నాలుగు గేదెలు మృతి