జోగులాంబ గద్వాల, జూలై 17: పున్నమి (ప్రతినిధి )
పిడుగుపాటు ఘటనల్లో మృతి చెందిన 8 కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సాయం విడుదల.
జిల్లాలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ. 6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో పిడుగుపాటు ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈనెల 13వ తేదీన ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ద్వారా వారి ఖాతాలకు నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధితులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనల మేరకు ఎక్స్‌గ్రేషియా సాయాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మల్దకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన బి. నవీన్ కుమార్, రాజోలి మండలం రాజోలి గ్రామానికి చెందిన కుర్వ వెంకటేష్, మల్దకల్ మండలం పవనపల్లి (హెచ్), పాల్వాయికి చెందిన కె. రాఘవేంద్ర, గద్వాల మండలం బాస్లచెరువు గ్రామానికి చెందిన గొల్ల శశిధర్, అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన వేముల రాజు, ఇటీక్యాల మండలం పెద్దదిన్నె గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు, మల్దకల్ మండలానికి చెందిన కుమారి వడ్డె ఆదిలక్ష్మి, గద్వాల మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన బి. రాజుకు రూ.6.00 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వర ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు.

