సి పి ఐ (ఎంఎల్) మాస్ లైన్ అనుబంధ విద్యార్థి సంఘం పిడిఎస్‌యూలో ఖమ్మం జిల్లాలో మూకుమ్మడి రాజీనామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కార్యదర్శి వంగూరి వెంకటేష్‌తో పాటు సహాయ కార్యదర్శులు సాదిక్ పాషా, యశ్వంత్, ఉపాధ్యక్షులు శశికిరణ్, వినయ్ తదితర జిల్లా కమిటీ సభ్యులు బాధ్యతలకు, మాస్‌లైన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు.
సంస్థలో సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు, కార్యకర్తలపై అణచివేత ధోరణులు, గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయని వారు ఆరోపించారు. ప్రగతిశీల, అభ్యుదయ భావజాలంతో విద్యార్థి సమస్యలపై పనిచేస్తామని, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
రాజీనామా చేసిన వారిలో శిలర్ పాషా, హరిచంద్ర ప్రసాద్, సందీప్, సురేష్, నవీన్, అన్వేష్, కార్తీక్, వెంకటేష్, నిఖిల్, వేల్పుల వెంకటేష్, విష్ణు, అశోక్, మహేష్, ఈశ్వర్, అసిఫ్ తదితరులు ఉన్నారు.



