అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆగస్టు 16 పున్నమి జిల్లా ప్రతినిధి
గతనెల అనారోగ్యంతో మృతి చెందిన పిచ్చుక సత్యనారాయణ భార్య పిచ్చుక సరస్వతి మానసిక వికారాంగురాలు వీరికి ముగ్గురు ఆడపిల్లలు. తండ్రిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని పి4 స్పూర్తితో జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న వెంటనే పోషణ కు అవసరమైన నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేశారు. మానసిక వికలాంగురాలైన తల్లిని మానసిక చికిత్సాలయంలో వైద్యం చేయించడమే కాకుండా, ఆడపిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలకి వెళ్లి పదవ తరగతి దృష్ట్యా ఈ కవలలైన ఆడపిల్లలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ప్రధాన ఉపాధ్యాయురాలుకి డిటిఓ విజ్ఞప్తి చేశారు.

