ఎర్పేడు, మే 30, (పున్నమి న్యూస్) : ఎర్పేడు మండలం పల్లాం గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ పాండురంగస్వామి అగ్నిగుండ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి విచ్చేసిన బృందమ్మకు పల్లాం రాజా, చంద్రశేఖర్ నాయుడు, గ్రామ పెద్దలు, మహిళలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగినేని చెంచయ్య నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, బత్తల గిరి నాయుడు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పాండురంగస్వామి మహోత్సవంలో పాల్గొన్న బొజ్జల బృందమ్మ