వార్త ముఖ్యాంశాలు
- జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్ష నరసరావుపేట: పల్నాడు జిల్లా నూతన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్ ఆదాహళ్లి ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
- జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యే నూతన ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, నూతన ఎస్పీ సమర్థవంతమైన…
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్ష
నరసరావుపేట: పల్నాడు జిల్లా నూతన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్ ఆదాహళ్లి ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యే నూతన ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, నూతన ఎస్పీ సమర్థవంతమైన నాయకత్వంలో జిల్లా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించి, సామాన్య పౌరులకు సత్వర న్యాయం అందించేలా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గంతో పాటు జిల్లా అంతటా ట్రాఫిక్ నియంత్రణ, మహిళా భద్రత, గంజాయి-మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు పోలీసు శాఖ చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్పీ జగదీశ్ పదవీ కాలం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
