Sunday, 13 September 2026
  • Home  
  • పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి: మేకపాటి విక్రమ్‌రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి: మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు, సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి):: విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గణనాథుని కృపతో ప్రతి కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరియాలని, ప్రజలు చేపట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రకృతికి హాని కలగకుండా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా జరగాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఇళ్లలో శాంతి, సంతోషం, సౌభాగ్యం నిండాలని మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.