Wednesday, 23 September 2026
  • Home  
  • పదవీకాలం పూర్తి చేసుకున్న దుత్తలూరు ZPTC లక్ష్మీకాంతమ్మకు ఘన సత్కారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదవీకాలం పూర్తి చేసుకున్న దుత్తలూరు ZPTC లక్ష్మీకాంతమ్మకు ఘన సత్కారం

దుత్తలూరు: జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయిన సందర్భంగా దుత్తలూరు మండలం జెడ్పీటీసీ శ్రీమతి లెక్కల లక్ష్మీకాంతమ్మను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆమెను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీగా మండల ప్రజలకు అందించిన సేవలను ప్రశంసించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని లక్ష్మీకాంతమ్మకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అందించిన సహకారం, ఆదరణకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.