మార్కెట్ ప్రాంగణం పరిధిలో నిర్దేశించిన మార్కింగ్‌ను దాటి వీధి వ్యాపారస్తులు ఎక్రయాల జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిరంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పర్యవేక్షించాలని సూచించారు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు దుకాణాలకు ఎదురుగా రవాణాకు ఇబ్బందికరంగా స్టాక్ ఏర్పాటు చేసుకోవడం, చెడిపోయిన కూరగాయలను రోడ్లపై పారవేయడం తదితర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు.
వీధి వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయకుండా, రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలను వేయకుండా సంబంధిత విభాగాల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ శేషగిరిరావు, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథ రావు, ట్రాఫిక్ పోలీసు విభాగం ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



