ఇటీవలి రోజుల్లో నిఫ్టీ సూచీ పరిమిత శ్రేణిలోనే కదులుతుండటంతో మార్కెట్‌లో అనిశ్చితి వాతావరణం నెలకొంది. 23,800 స్థాయి దాటితేనే కొత్త కొనుగోళ్లకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడి అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే వారంలో విదేశీ మార్కెట్ల ప్రభావం కీలకంగా ఉండనుంది.


