లోకేష్ గెలుపు మొక్కు పై ధన్యవాదాలు
నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని హృదయపూర్వకంగా కోరుకుని, ఆయన గెలిస్తే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్వామివారికి శాశ్వత రథం సమర్పిస్తానని సినీ నిర్మాత, తెలుగుదేశం వీరాభిమాని కావలి వాసి అట్లూరి నారాయణరావు మనసారా సంకల్పించి, ఆమేరకు. ఎంతో ఆనందం, భక్తి భావంతో ఈ ఏడాది జనవరి 24వ తేదీన నే స్వామివారికి కోటిరూపాయలకు పైగా విలువైన శాశ్వత రథాన్ని తయారు చేయించిన నారాయణరావు రావు కుటుంబం ను నారా భువనేశ్వరి ఆత్మీయ విందు ఇచ్చారు.
ఈ పుణ్య కార్యక్రమానికి నారా భువనేశ్వరి ని మరియు నారా రోహిత్ ని ఆహ్వానించగా, అయితే ఆ రోజున భువనేశ్వరి కి అవకాశం లేకపోవడంతో, నారా రోహిత్ చేతుల మీదుగా స్వామికి నారాయణరావు రథం సమర్పించారు.
ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఎంతో ప్రేమతో భువనేశ్వరి నారాయణరావు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి, అభినందించారు .తన కుటుంబంతో ఆమె చూపిన ఆప్యాయత, గడిపిన ఆ సంతోష క్షణాలు తమ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతాయని. ఆ సందర్భంలో వారు తనకు తెలియజేసిన కృతజ్ఞత మనసులో శాశ్వతంగా నిలిచి పోతుందని
ఈ ప్రేమ, ఆత్మీయత, గౌరవానికి తాను ఎల్లప్పుడూ భువనమ్మ కి రుణపడి ఉంటానని నారాయణరావు తెలిపారు.


