ఖానాపురం పున్నమి ప్రతినిధి: హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రంలో నవంబర్ 22న నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ను నర్సంపేటలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్వేరో రాష్ట్ర కన్వీనర్ మంద శ్యామ్ ఆవిష్కరించారు.
నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ కల్లెపల్లి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్వేరోస్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యాన్ని విస్తరించడమే స్వేరో సమ్మేళనం లక్ష్యమని నాయకులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్వేరో నాయకులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, బహుజన వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, ఖానాపురం మండలం స్వేరో కన్వీనర్లు, నేలమర్రి నాగరాజు, సోమరపు రవి, కో-కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, పలువురు స్వేరో నాయకులు పాల్గొన్నారు.
