ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించి, మిగతా రెండు మండలాలను విస్మరించడం అన్యాయమన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి, పెట్టుబడులు చేతికందక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఖానాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్, బత్తిని శ్రీనివాస్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య. సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
