ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపురం మండలంలో నర్సంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితులైన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే భూపాలపల్లి నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ గుగులోతు రామస్వామి నాయక్ గారికి బుధరావుపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు నాయకులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ, అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటరమణ నరసయ్య గారు, బుధరావుపేట మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ గారు, ఉపసర్పంచ్, సింగ్ సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు sk యాకూబ్ పాషా , మాజీ అధ్యక్షులు నేలమర్రి నాగరాజు వార్డు సభ్యులు, చెడుపాక శ్రీను, బండి రాజు, నవీన్ sk యాకూవలి , బానోత్ నగేష్ సీనియర్ నాయకులు పులిగుల్ల యాదగిరి యాదవ్,లాదినేని ఎల్లన్న ఎర్రబెల్లి మల్లన్న,sk లతీఫ్ ,పార్టీ mlc ఎలక్షన్స్ ఇంచార్జి లు సోమరపు రవి . పెద్దపల్లి యాకన్న. రాంబాబు అజయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
