*విధులను చిత్తశుద్ధితో నిర్వహించండి.
*కమిషనర్ ఎం.జయకృష్ణ.*
తిరుపతి ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి
నగరంలో పారిశుధ్థ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరింత మెరుగ్గా పనులు చేపట్టాలని, ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధి తో విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ సిబ్బందికి సూచించారు. ఆదివారం ఉదయం నగరంలోని న్యూ మారుతి నగర్, రాయల్ నగర్, వైకుంఠపురం, మహిళా విశ్వావిద్యాలయం, ఎల్.ఎస్.నగర్, బాలాజీ కాలనీ, మహాతి ఆడిటోరియం తదితర ప్రాంతాల్లో పారిశుధ్థ్య పనులను కమిషనర్ పరిశీలించారు. న్యూ బాలాజీ కాలనీలోని చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను పరిశీలించారు. ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంత చెత్త తరలిస్తున్నారు వంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. కాలువల్లో చెత్త లేకుండా చూడాలని, డివైడర్ల మధ్య, కూడళ్ళలో ఎండిన మొక్కలు, చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విధులను దైవంగా భావించి చిత్తశుద్ధితో పని చేయాలని సిబ్బందికి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచాలని, అధికారులు, సిబ్బంది, ప్రజల వాహనాలను ఒక క్రమపద్దతిలో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మేనేజర్ హాసీమ్, పారిశుధ్థ్య సిబ్బంది ఉన్నారు.








