Thursday, 25 June 2026
  • Home  
  • నందవరం మోడల్ స్కూల్బస్సు పునరుద్ధరణ కోసం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట విద్యార్థుల నిరసన!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందవరం మోడల్ స్కూల్బస్సు పునరుద్ధరణ కోసం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట విద్యార్థుల నిరసన!

మర్రిపాడు: మండలం నందవరం మోడల్ స్కూల్ లో రద్దు చేసిన పాఠశాల బస్సును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చుంచులూరు,పడమటి నాయుడుపల్లి పంచాయతీలకు చెందిన నందవరం మోడల్ స్కూల్ విద్యార్థులు బుధవారం మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ,నందవరం మోడల్ స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సును రద్దు చేయడంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడం కష్టంగా మారిందన్నారు.బస్సు లేకపోవడంతో పాఠశాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మకూరుకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించినట్లు తెలిపారు.దీనిపై స్పందించిన మంత్రి,విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చి,విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై బాగా చదువుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా పాఠశాల బస్సు పునరుద్ధరణకు సంబంధించి ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విద్యార్థులు,తల్లిదండ్రులు తెలిపారు.అయితే మంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ డిపో మేనేజర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ సమస్యను ఉన్నథాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టినట్లు వెల్లడించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల బస్సును వెంటనే పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని,ఆర్టీసీ అధికారులను కోరారు.ఈ నిరసనలో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.