Monday, 21 September 2026
  • Home  
  • నందలూరు అరవపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షేక్ షబ్బీర్ అహ్మద్
- అన్నమయ్య

నందలూరు అరవపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షేక్ షబ్బీర్ అహ్మద్

నందలూరు అరవపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షేక్ షబ్బీర్ అహ్మద్ నెక్సన్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ, అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో నందలూరు మండలం అరవపల్లిలోని ఉర్దూ షాదీ ఘర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షేక్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు. ?ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శిబిరం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. శిబిరానికి విచ్చేసే రోగులకు ఉచిత భోజన సదుపాయంతో పాటు, శస్త్రచికిత్స (ఆపరేషన్) అవసరమైన వారికి తిరుపతికి ఉచితంగా వెళ్లి రావడానికి రవాణా (ట్రాన్స్పోర్ట్) సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. నందలూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ?గురువారం రోజున శిబిరం జరగనున్న ఉర్దూ షాదీ ఘర్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి, వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. ?ఈ కార్యక్రమంలో నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (రాయలసీమ జోన్ డ్రగ్స్ అండ్ క్రైమ్) చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి, మాజీ వర్ఫ్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, భాను ప్రకాష్ రాజు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, సమాజ సేవ సమితి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పఠాన్ మెహర్ ఖాన్, ఉదయ్ కుమార్, పఠాన్ షబ్బీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

నందలూరు అరవపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షేక్ షబ్బీర్ అహ్మద్
నెక్సన్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ, అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో నందలూరు మండలం అరవపల్లిలోని ఉర్దూ షాదీ ఘర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షేక్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు. ?ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శిబిరం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. శిబిరానికి విచ్చేసే రోగులకు ఉచిత భోజన సదుపాయంతో పాటు, శస్త్రచికిత్స (ఆపరేషన్) అవసరమైన వారికి తిరుపతికి ఉచితంగా వెళ్లి రావడానికి రవాణా (ట్రాన్స్పోర్ట్) సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. నందలూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ?గురువారం రోజున శిబిరం జరగనున్న ఉర్దూ షాదీ ఘర్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి, వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. ?ఈ కార్యక్రమంలో నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (రాయలసీమ జోన్ డ్రగ్స్ అండ్ క్రైమ్) చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి, మాజీ వర్ఫ్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, భాను ప్రకాష్ రాజు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, సమాజ సేవ సమితి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పఠాన్ మెహర్ ఖాన్, ఉదయ్ కుమార్, పఠాన్ షబ్బీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.