Tuesday, 28 July 2026
  • Home  
  • ధర్మరాజుల బ్రహ్మోత్సవాల ఘన విజయం-సహకరించిన ప్రతి ఒక్కరికీ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కృతజ్ఞతలు
- తిరుపతి

ధర్మరాజుల బ్రహ్మోత్సవాల ఘన విజయం-సహకరించిన ప్రతి ఒక్కరికీ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కృతజ్ఞతలు

శ్రీ కాళహస్తి, జులై 27, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అందులో ప్రధాన ఘట్టమైన పవిత్ర అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా, కనులపండువగా విజయవంతంగా ముగియడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఉత్సవాల విజయవంతంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇంతటి భారీ ఆధ్యాత్మిక వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, విచ్చేసిన భక్తజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడంలో వివిధ ప్రభుత్వ విభాగాలు భుజం భుజం కలిపి పనిచేశాయని కొనియాడారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన కూటమి నాయకులకు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ అధికారులకు, దేవస్థాన సిబ్బందికి, రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచిన పారిశుద్ధ్య సిబ్బందికి, నిరంతర విద్యుత్ సరఫరా అందించిన విద్యుత్ శాఖ అధికారులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి, అత్యవసర వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బందికి, వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మహోత్సవం మహా విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరి సేవలు చిరస్మరణీయమైనవని, ఆ శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి దివ్య అనుగ్రహం, ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కొట్టే సాయి ప్రసాద్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.