*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 16 చిట్టమూరు మండలం,*
దృష్టిలోపాన్ని అరికట్టేందుకు మా వంతు సహకారం కృషి చేస్తున్నామని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
ఆదివారం చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దృష్టిలో ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఇటీవల కోట మండలం గూడలి, వాకాడు మండలం కొండాపురం, కోట మండలం గూడలి గ్రామాలలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న 35 మందిని గుర్తించారు.
చిరంజీవి ముప్పువరపు వెంకట రవి కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయా గ్రామాల్లో దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
మూడు గ్రామాల్లో నేత్ర వైద్య శిబిరాలు ద్వారా కంటి శుక్లాలు ఉన్నవారికి కంటి ఆపరేషన్లు, కంటి అద్దాలను ఎంవి రావు ఫౌండేషన్ వారు కోట రమేష్ ఐ కేర్ నేతృత్వంలో కంటి అద్దాలు, వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటిలో శుక్లాల ఆపరేషన్లు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
వెంకట రవి కిరణ్ కు ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు.



