దుత్తలూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్ధార్థ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. విద్యార్థులు 200 అడుగుల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తి నినాదాలతో దుత్తలూరు మార్మోగింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



