ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధ
మనుబోలు: కుల వివక్షత లేని సమాజం కోసం జులై 16 నుంచి దళిత, గిరిజన కాలనీల్లో అధ్యయన యాత్రలు నిర్వహించినట్లు కెవిపిఎస్ మండల కార్యదర్శి తలారి దేవదానం తెలిపారు. మంగళవారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కొలనుకుదురు దళితవాడకు స్మశానవాటిక ఏర్పాటు చేయాలని, చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. అయితల్పూర్లో 30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు 170 మంది దళిత, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ల నమోదు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆదిశేషయ్య పాల్గొన్నారు.

దళిత, గిరిజన సమస్యలు పరిష్కరించాలి: కెవిపిఎస్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధ మనుబోలు: కుల వివక్షత లేని సమాజం కోసం జులై 16 నుంచి దళిత, గిరిజన కాలనీల్లో అధ్యయన యాత్రలు నిర్వహించినట్లు కెవిపిఎస్ మండల కార్యదర్శి తలారి దేవదానం తెలిపారు. మంగళవారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కొలనుకుదురు దళితవాడకు స్మశానవాటిక ఏర్పాటు చేయాలని, చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. అయితల్పూర్లో 30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు 170 మంది దళిత, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ల నమోదు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆదిశేషయ్య పాల్గొన్నారు.

