Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

దళిత క్రైస్తవులకు రిపబ్లికన్ పార్టీ సంపూర్ణ మద్దతు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

క్రైస్తవులకు తమ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ( ఆర్ పి ఐ అత్వాలే) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ ఏపి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ చార్జి జ్యోతి జార్జ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గతంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ప్రకటించినట్లు చెప్పా రు.ఇందులో భాగంగానే తమ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకట స్వామి ఆదే శాల మేరకు మద్దతు ఇస్తున్నట్లు జార్జ్ తెలిపారు. 1950 రాష్ట్ర పతి ఉత్తర్వులు దళిత క్రైస్తవు లకు గొడ్డలి పెట్టులా మారిందని ఆవేధన వ్యక్తం చేశారు.రాజ్యాం గానికి లోబడే తీర్పులు ఉండా లని, ఉద్దేశ పూర్వకంగా, వివక్ష తోకూడిన విధానాలు ఉండకూ డదని హితవు పలికారు.ఏ కులా నికి లేని అడ్డంకులు ఎస్సీలకే పరిమితం చేయడం శోచనీయ మన్నారు.మతం అనేది మనిషి జీవనం విధానమని, మతం మా రితే వారి ఆర్థిక పరిస్థితి ఏమా త్రం మారదన్నా రు.కులా నికి మతానికి ముడిపెట్టడం సరికా దన్నారు. దళిత క్రైస్తవుల విష యం లో కోర్టులు, పాలకులు పునరాలోచించాలని కోరారు.

దళిత క్రైస్తవులకు రిపబ్లికన్ పార్టీ సంపూర్ణ మద్దతు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *