*దక్షిణ నియోజకవర్గంలో సెంటు భూములో ఆప్షన్ – 3 ద్వారా పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు గృహ స్వాధీన పత్రం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి*
దక్షిణ నియోజకవర్గం పరిధిలో సెంటు భూములో ఆప్షన్ – 3 ద్వారా పూర్తయిన గృహాలకు స్వాధీన పత్రమును ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు లబ్ధిదారులకు అందజేశారు. గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్ లబ్ధిదారులకు అదనపు రూ.50,000/- సహాయం మరియు హ్యాండోవర్ ప్రక్రియ కార్యక్రమం జూన్ 3 కార్యాలయంలో నిర్వహించారు . ముఖ్యంగా గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్‌కు సంబంధించిన లబ్ధిదారులకు గత ప్రభుత్వ కాలంలో గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్‌కు చెందిన లబ్ధిదారులకు రూ.1,80,000/- (ఒక లక్ష ఎనభై వేల రూపాయలు) మాత్రమే గృహ నిర్మాణ సహాయంగా మంజూరు చేయగా, కూటమి ప్రభుత్వం డిసెంబర్ 10, 2024 తరువాత పూర్తయిన (కంప్లీట్ అయిన) ఇళ్లకు సంబంధించి రూ.50,000/- (యాభై వేల రూపాయలు) అదనపు సహాయాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు (Government Orders) జారీ చేసిన నేపధ్యంలో ఈ అదనపు మొత్తాన్ని హౌస్ హ్యాండోవర్ పత్రాన్ని ఆన్‌లైన్ లాగిన్‌లో అప్‌లోడ్ చేసిన అనంతరం, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా రూ.50,000/- సహాయం SC, ST మరియు BC వర్గాలకు చెందిన లబ్ధిదారులకు మాత్రమే వర్తింపజేయబడిందని, OC వర్గాలకు ఈ సహాయం వర్తించదు అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని r తెలిపారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలో గంగవరం మరియు నంగినారుపాడు లేఔట్స్‌కు సంబంధించి మొత్తం 13,983 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయను వీటిలో 3,785 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. నియోజకవర్గం లో డిసెంబర్ 10, 2024 తరువాత పూర్తయిన ఇళ్లు 2,907 ఉన్నాయనీ,.ఈ 2,907 ఇళ్లకు చెందిన SC, ST, BC లబ్ధిదారులందరూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.50,000/- అదనపు సహాయానికి అర్హులనీ వివరించారు. అదనంగా వచ్చే నిధులతలబ్ధిదారుల ఇళ్లలో మరియు ఇల్లు చుట్టుపక్కల అవసరమైన పూర్తి పనులు చేయబడును. ముఖ్యంగా లోపల–బయట ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, లోపల–బయట వైట్ వాష్, పెయింటింగ్, ప్రధాన తలుపులు, బాత్రూమ్ డోర్స్, స్టెప్స్ (మెట్లు) వంటి పనులు చేయబడతాయినీ వివరించారు.
అలాగే గతంలో కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికే రూ.35,000/- స్వంతంగా చెల్లించిన సందర్భాలలో, వారికి మొత్తం రూ.85,000/- విలువైన అదనపు పనులు (Extra Items) చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్, వైరింగ్ పనులు మరియు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అనుమతించబడిన ఇతర అవసరమైన పనులు కూడా చేయబడతాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లక్ష్మి గారు ప్రజలందరికీ మేలు చేకూర్చే విధంగా కృషి చేస్తున్నామని కూటం ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టు నుంచి ప్రజా సంక్షేమ దేంగా పని చేస్తుందని వివరించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, స్టేట్ డైరెక్టర్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ శ్రేణులు గృహ నిర్మాణ అధికారులు పాల్గొన్నారు….


