*కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం*
*స్థానిక నాయకత్వం గెలుపు గుర్రాలని ఎంపిక చేయాలి*
*పార్టీకి నష్టం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఎవరినైనా ఉపయోగించం*
*పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కనివ్వను*
*స్థానిక ఎన్నికల్లో సమిష్టి కృషితో 100% స్ట్రైక్ రేట్ సాధిద్దాం*
*నాయకుడిలా కాదు మీలో ఒకడిలా-మీతో మమేకమై పనిచేస్తా… ప్రతి ఓటుకు టిడిపికి వచ్చేలా చేద్దాం*
_ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు_
“””””””””””””””””””””””””””””””””””
బుధవారం ఇబ్రహీంపట్నం కార్యకర్తల విస్తృత సమావేశంలో మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం ఆయన మాట్లాడుతూ
పోటీ చేసే అభ్యర్థుల విషయంలో గ్రామ స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు తీసుకునే నిర్ణయాలే శిరోధార్యం అన్నారు. తీసుకున్న నిర్ణయానికి ప్రతీ నాయకుడు, కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచినా, కుట్రలు పన్నినా లేదా ప్రత్యర్థులకు సహకరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలా చేస్తే తన కార్యాలయం మెట్లు కూడా ఎక్కనివ్వనని తేల్చి చెప్పారు.పార్టీని భుజాన మోసి, కష్టపడిన అసలైన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని, వారి ప్రయోజనాలను కాపాడుతామని వెల్లడించారు. సమిష్టి కృషితో పనిచేసి మైలవరం నియోజకవర్గ స్థానిక ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ సాధిద్దామని, తాను కూడా వారితో మమేకమై, ప్రతి ఓటు టిడిపికి పడేలా పని చేద్దామని కార్యకర్తలు ఉత్సాహం నింపారు.

