పున్నమి: తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో, ప్రతి అర్హత కలిగిన ఓటరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్ఐఆర్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించి తమ ఓటు నమోదును నిర్ధారించుకోవాలని,
నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు.
తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, అలాగే దొంగ ఓట్లు లేదా అనర్హుల పేర్లు ఓటరు జాబితాలో చేరకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన అన్నారు.

















