తెలకపల్లి: మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ, ఆవాస ప్రాంతాల్లో ఉన్న కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఏపీవో మల్లేష్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన సిబ్బందితో సమీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిబంధనల ప్రకారం వర్కింగ్ మినిట్స్ పాటిస్తూ కూలీలకు పనులు కేటాయించాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

తెలకపల్లి : అర్హులైన కూలీలందరికీ ఉపాధి పనులు