తెలంగాణ ఉద్యమ కారుల వేదిక బెల్లంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో తాపీ సంఘం భవనం లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరగింది. ఈ సంధర్భంగా తెలంగాణ ఉద్యకారుల వేదిక రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో లో ఉద్యమ కారులకు ఇచ్చిన హమీలనులను నెరవేర్చలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జన ఉద్యమం లో పాల్గొన్న ప్రతి ఉద్యమ కారునికి న్యాయం చేయాలనీ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన 250చదరపు అడుగుల భూమి, 20లక్షల హెల్త్ కార్డు, 25వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు గోగార్ల. రాజేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు కళావతి, స్వాతి, తోడేటి. స్వరూప, బెల్లంపల్లి మండల అధ్యక్షులు అచ్చే సత్తయ్య, వేదిక నాయకులు ఎల్తూరి శంకర్, k. రామ్మోహన్, v. రాజేందర్, k, సత్తన్న, ఎలిగేటి. శ్రీనివాస్, మామిడి రాoచందర్,చెప్యాల నిరంజన్, తదితరులు పాల్గొన్నారు


