Wednesday, 22 July 2026
  • Home  
  • తిరుపతిలో ‘వేదాంతం’ నాటికకు ప్రేక్షకుల ప్రశంసలు అభినయ ఆర్ట్స్ గరుడ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రదర్శన_
- తిరుపతి

తిరుపతిలో ‘వేదాంతం’ నాటికకు ప్రేక్షకుల ప్రశంసలు అభినయ ఆర్ట్స్ గరుడ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రదర్శన_

పున్నమి ప్రతినిధి ,తిరుపతి కల్చరల్ జూలై 22 సామాజిక అంశాలను, మానవ సంబంధాలలోని లోతులను కళాత్మకంగా ఆవిష్కరించిన ‘వేదాంతం’ నాటిక బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గరుడ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నాటిక ప్రదర్శించబడింది. అరుణ, సత్తిరాజు దంపతుల కథ ఇది. సత్తిరాజుకు ఎలాంటి రాజకీయ, ఇతర అలవాట్లు లేవు. కానీ అతడు భార్య అరుణను నిరంతరం బాధపెడుతుంటాడు. ఈ సమయంలో అరుణకు ఒక అజ్ఞాత ప్రేమికుడు చలపతి నుండి పేరు, చిరునామా లేని ఎన్నో ప్రేమ లేఖలు అందుతుంటాయి. సత్తిరాజు పెట్టే వేధింపులు భరించలేక అరుణ ఆ లేఖలను అడ్డుపెట్టుకొని అతనిని అడ్డుతొలగించుకుంటుంది. ఈ విషయాన్ని కనిపెట్టిన మైసమ్మ అరుణను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో సత్తిరాజు స్నేహితుడైన చలపతి, సత్తిరాజు కోరిక మేరకు అవిటివాడైన అతని మేనల్లుడిని తీసుకెళ్లేందుకు ఇంటికి వస్తాడు. అక్కడ అరుణ పడుతున్న బాధను చూసిన చలపతి, మైసమ్మ బారి నుండి ఆమెను కాపాడతాడు. తానే ఆ అజ్ఞాత ప్రేమికుడినని చెప్పి అరుణకు కొత్త జీవితాన్ని అందిస్తాడు. నైతిక విలువలు, స్త్రీ ఆత్మగౌరవం చుట్టూ అల్లుకున్న ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. మూల కథ: కీర్తిశేషులు శ్రీ గుడిపాటి వెంకటాచలం నాటికీకరణ: మార్గశీర్ష, అమలాపురం దర్శకత్వం: శ్రీ ముత్యాలరావు పొన్నాడ బలమైన పాత్ర చిత్రణలు, సహజమైన నటన, సంభాషణలతో నాటిక ప్రేక్షకుల నుండి చప్పట్లు అందుకుంది. సమాజంలోని కుటుంబ సమస్యలు, మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆపద్బాంధవుడి ఆవశ్యకతను ఈ నాటిక చక్కగా చూపిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అభినయ ఆర్ట్స్ స్థాపకులు బి.యన్.రెడ్డి కళాకారుల నటన, దర్శకుడి కృషిని విశిష్ట అతిథులు ప్రత్యేకంగా ప్రశంసించారు

పున్నమి ప్రతినిధి ,తిరుపతి కల్చరల్ జూలై 22

సామాజిక అంశాలను, మానవ సంబంధాలలోని లోతులను కళాత్మకంగా ఆవిష్కరించిన ‘వేదాంతం’ నాటిక బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గరుడ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నాటిక ప్రదర్శించబడింది.

అరుణ, సత్తిరాజు దంపతుల కథ ఇది. సత్తిరాజుకు ఎలాంటి రాజకీయ, ఇతర అలవాట్లు లేవు. కానీ అతడు భార్య అరుణను నిరంతరం బాధపెడుతుంటాడు. ఈ సమయంలో అరుణకు ఒక అజ్ఞాత ప్రేమికుడు చలపతి నుండి పేరు, చిరునామా లేని ఎన్నో ప్రేమ లేఖలు అందుతుంటాయి. సత్తిరాజు పెట్టే వేధింపులు భరించలేక అరుణ ఆ లేఖలను అడ్డుపెట్టుకొని అతనిని అడ్డుతొలగించుకుంటుంది.
ఈ విషయాన్ని కనిపెట్టిన మైసమ్మ అరుణను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో సత్తిరాజు స్నేహితుడైన చలపతి, సత్తిరాజు కోరిక మేరకు అవిటివాడైన అతని మేనల్లుడిని తీసుకెళ్లేందుకు ఇంటికి వస్తాడు. అక్కడ అరుణ పడుతున్న బాధను చూసిన చలపతి, మైసమ్మ బారి నుండి ఆమెను కాపాడతాడు. తానే ఆ అజ్ఞాత ప్రేమికుడినని చెప్పి అరుణకు కొత్త జీవితాన్ని అందిస్తాడు. నైతిక విలువలు, స్త్రీ ఆత్మగౌరవం చుట్టూ అల్లుకున్న ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.

మూల కథ: కీర్తిశేషులు శ్రీ గుడిపాటి వెంకటాచలం
నాటికీకరణ: మార్గశీర్ష, అమలాపురం
దర్శకత్వం: శ్రీ ముత్యాలరావు పొన్నాడ

బలమైన పాత్ర చిత్రణలు, సహజమైన నటన, సంభాషణలతో నాటిక ప్రేక్షకుల నుండి చప్పట్లు అందుకుంది. సమాజంలోని కుటుంబ సమస్యలు, మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆపద్బాంధవుడి ఆవశ్యకతను ఈ నాటిక చక్కగా చూపిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
అభినయ ఆర్ట్స్ స్థాపకులు బి.యన్.రెడ్డి కళాకారుల నటన, దర్శకుడి కృషిని విశిష్ట అతిథులు ప్రత్యేకంగా ప్రశంసించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.