Sunday, 13 September 2026
  • Home  
  • తిరుపతి జిల్లా: దొరవారిసత్రం మండలం వేణుంబకం రోడ్డు లొ పగిలి బోల్తా – తప్పిన పెను ప్రమాదం*
- తిరుపతి

తిరుపతి జిల్లా: దొరవారిసత్రం మండలం వేణుంబకం రోడ్డు లొ పగిలి బోల్తా – తప్పిన పెను ప్రమాదం*

తడ నుండి నెల్లూరుకు చెరకు లోడుతో వెళ్తున్న లారీ టైర్ పగిలి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన దొరవారిసత్రం మండలం, వేణుంబాకం రోడ్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తడ నుండి నెల్లూరుకు చెరకు గడలను తరలిస్తున్న లారీ వేణుంబాకం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ముందు టైర్ పగిలింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. లారీలో ఉన్న చెరకు గడలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ కు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడినట్లు సమాచారం. రోడ్డుపై చెరకు పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోటో లో లారీ నుండి పడిపోయిన చెరకు గడలను తొలగిస్తున్న స్థానికులు.

తడ నుండి నెల్లూరుకు చెరకు లోడుతో వెళ్తున్న లారీ టైర్ పగిలి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన దొరవారిసత్రం మండలం, వేణుంబాకం రోడ్డులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తడ నుండి నెల్లూరుకు చెరకు గడలను తరలిస్తున్న లారీ వేణుంబాకం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ముందు టైర్ పగిలింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. లారీలో ఉన్న చెరకు గడలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ కు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడినట్లు సమాచారం.

రోడ్డుపై చెరకు పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫోటో లో లారీ నుండి పడిపోయిన చెరకు గడలను తొలగిస్తున్న స్థానికులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.