ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట మౌలిక వసతులకు దూరంగా ఉంది. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న నాయకుల హామీలు నీటిమూటలయ్యాయి. రైలు గేటు, రథోత్సవ మార్గాల్లో డ్రైనేజీ కాలువలు, పచ్చదనం ఏర్పాటు శూన్యం. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు ఊసే లేదు. రోడ్లపై మురుగు నీరు చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ఎంపీడీవో సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

తాగునీరు లేదు , సబ్స్టేషన్ లేదు.. | కొండబిట్రగుంట వాసుల ఇక్కట్లు