Tuesday, 18 August 2026
  • Home  
  • తల్లి వర్ధంతిని పురస్కరించికొని భావోద్వేగ నివాళులు
- విజయనగరం 

తల్లి వర్ధంతిని పురస్కరించికొని భావోద్వేగ నివాళులు

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 15. పున్నమి ప్రతినిధి కొత్తవలస మండలం మంగళ పాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు తల్లి ప్రధమ వర్ధంతి సందర్భంగా శ్రీ గురు దేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మెయిన్ బ్రాంచ్ మంగళపాలెం తరఫున నిర్వాహకులు తమ తల్లి శ్రీమతి రాపర్తి సుబ్బలక్ష్మి గారి ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సందేశంలో తల్లి ప్రేమ, త్యాగం, మమకారం గురించి హృదయాన్ని కదిలించే విధంగా భావోద్వేగాలను వ్యక్తం చేశారు. “మా హృదయ పలకపై చెక్కిన సజీవ శిల్పం మా అమ్మ రూపం. జీవితంలో ఎదురైన ప్రతి కష్టంలో ధైర్యం నూరిపోసిన ప్రేరణ మా తల్లి. ఆమె చూపిన మార్గదర్శకత్వం, విలువలు మా జీవితానికి ఆదర్శం” అని పేర్కొన్నారు. అనంతరం తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 15. పున్నమి ప్రతినిధి

కొత్తవలస మండలం మంగళ పాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు తల్లి ప్రధమ వర్ధంతి సందర్భంగా శ్రీ గురు దేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మెయిన్ బ్రాంచ్ మంగళపాలెం తరఫున నిర్వాహకులు తమ తల్లి శ్రీమతి రాపర్తి సుబ్బలక్ష్మి గారి ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సందేశంలో తల్లి ప్రేమ, త్యాగం, మమకారం గురించి హృదయాన్ని కదిలించే విధంగా భావోద్వేగాలను వ్యక్తం చేశారు. “మా హృదయ పలకపై చెక్కిన సజీవ శిల్పం మా అమ్మ రూపం. జీవితంలో ఎదురైన ప్రతి కష్టంలో ధైర్యం నూరిపోసిన ప్రేరణ మా తల్లి. ఆమె చూపిన మార్గదర్శకత్వం, విలువలు మా జీవితానికి ఆదర్శం” అని పేర్కొన్నారు.

అనంతరం తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.