తల్లాడ / ఖమ్మం
తల్లాడ మండలంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లాడ టౌన్లో కీ.శే. గువ్వల రామిరెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొల్లగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుండేటి కేశవరెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



