తొట్టంబేడు, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( తొట్టంబేడు మండల పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో వ్యాపార విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించ తలపెట్టిన పెట్రోల్ బంకు నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావెళ్ళ మునిరాజనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు కేవలం రుణాలకే పరిమితం కాకుండా, ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తంగేళ్లపాలెం సింగల్ విండో బ్యాంక్ చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి చలపతినాయుడు, గాలి మురళినాయుడు, బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్, చిల్లకూరు బాలసుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, చందు, సుబ్రహ్మణ్యం, విజయ్, వెంకటేష్, రాజ, బ్యాంకు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తంగేళ్లపాలెం సొసైటీ ప్రగతి పథం-పెట్రోల్ బంకు నిర్మాణానికి భూమి పూజ