Friday, 25 September 2026
  • Home  
  • డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి
- ఖమ్మం

డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి

నేలకొండ పల్లి / ఖమ్మం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్‌గిరి తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తేజావత్ బాలాజీ (60) వినాయక మండపం వద్ద భోజనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా బొడ్రాయి సమీపంలోని డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఆ సమయంలో చీకటిగా ఉండటంతో పాటు వర్షం కురుస్తుండటంతో బాలాజీ కాలువలో పడిన విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. దీంతో రాత్రంతా కాలువలోనే ఉండిపోయారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలాజీ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నేలకొండ పల్లి / ఖమ్మం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్‌గిరి తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తేజావత్ బాలాజీ (60) వినాయక మండపం వద్ద భోజనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా బొడ్రాయి సమీపంలోని డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఆ సమయంలో చీకటిగా ఉండటంతో పాటు వర్షం కురుస్తుండటంతో బాలాజీ కాలువలో పడిన విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. దీంతో రాత్రంతా కాలువలోనే ఉండిపోయారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలాజీ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.