*జనసేన శ్రేణులకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను.*
విజయవాడ ఎన్టీఆర్ పున్నమి ప్రతినిధి సురేష్
_జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. కావున ఆయా నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, నియోజకవర్గ ఇన్చార్జిలు మరియు పీఓసీలతో సమన్వయం చేసుకుంటూ, సంబంధిత ప్రాంతాల్లో నిర్వహించే సర్వమత ప్రార్థన కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.


